19, నవంబర్ 2016, శనివారం

మహా గణేశ పంచరత్న స్తోత్రం

                 


      మహా గణేశ పంచరత్న స్తోత్రం

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 ||

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 ||

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5 ||

మహాగణేశ పంచరత్నమాదరేణ యో‌உన్వహమ్ |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో‌உచిరాత్ ||

16, నవంబర్ 2016, బుధవారం

Karthika Masam Special Days

                                   

                                             కార్తీక ద్వాదశి నేడే: తులసీ కోటను పూజించండి
కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.

కార్తీక మాసం మొత్తం మీద కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రభోదిస్తాయని పండితులు అంటున్నారు.

కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రబోధ ఏకదాశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.

"అందుచేత ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే,
త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవసించాలి. ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటున్నారు.
అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు.
ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

మహా గణేశ పంచరత్న స్తోత్రం

                        మహా గణేశ పంచరత్న స్తోత్రం ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ | కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ | అనాయకైక న...